తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం హర్షణీయం' - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా నిర్మల్​ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామంలో తెరాస నేతలు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

The new Revenue Act is historic: mpp
సీఎం కేసీఆర్‌, మంత్రి అల్లోల చిత్రపటాలకు పాలాభిషేకం

By

Published : Sep 12, 2020, 4:14 PM IST

రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం హర్షణీయమని సారంగాపూర్ మండల పరిషత్ అధ్యక్షులు అట్లా మహిపాల్​రెడ్డి పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా నిర్మల్​ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామంలో సీఎం కేసీఆర్‌, మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమని మహిపాల్​రెడ్డి పేర్కొన్నారు. ఈ నూతన చట్టంతో భూ సమస్యలన్నీ తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అట్లా యశోద-పోతారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు మధుకర్​రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ గోవింద్​రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ వ్యూహరచన

ABOUT THE AUTHOR

...view details