నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగాన్గాంవ్లో ఓ యువకుని హత్య కలకలం రేపింది. మహారాష్ట్రలోని బనెల్లి గ్రామానికి చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి తానూర్ మండల కేంద్రానికి ఇల్లరికం వచ్చాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింగాన్గాంవ్లో విగతజీవిగా పడి ఉన్న చంద్రకాంత్‌ను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ద్విచక్ర వాహనం ఆధారంగా పోలీసులు మృతుడిని గుర్తించారు. రోడ్డు ప్రమాదం వల్ల మరణించాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి దగ్గరి బంధువులతో భూ తగాదాలు ఉన్నాయని చంద్రకాంత్ తమ్ముడు తెలిపారు.
నిర్మల్ జిల్లా సింగన్గాంవ్లో యువకుని హత్య? - nirmal
నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగాన్గాంవ్లో ఓ యువకుని హత్య కలకలం రేపింది. రోడ్డు ప్రమాదం వల్ల మరణించాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యువకుని హత్య?