తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్ జిల్లాలో .. ఘనంగా కూడారై ఉత్సవం - Koodarai festival nirmal district

నిర్మల్ జిల్లాలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడారై ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

The Koodarai festival was organized as a festival of the eyes at the Devarakota Sri Lakshmi Venkateswara Swamy Temple in Nirmal district.
నిర్మల్ జిల్లాలో .. ఘనంగా కూడారై ఉత్సవం

By

Published : Jan 11, 2021, 3:30 PM IST

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడారై ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారికి నైవేద్యంగా..

ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమైన 27 వరోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. పాయసాన్ని గంగాళాల్లో వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారని.. అందుకే ఈ పండగని పాయసోత్సవం, గంగాళాల ఉత్సవమని పిలుస్తారని వివరించారు.

ఇదీ చదవండి:భక్తి పారవశ్యం... యాదాద్రిలో జన సందోహం

ABOUT THE AUTHOR

...view details