తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యం' - minister ik reddy visited nirmal

విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని చించోలి (బి) గ్రామ శివారులో నిర్మిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

first ever minority residential school is constructed in nirmal
నిర్మల్​లో మంత్రి ఇంద్రకరణ్ పర్యటన

By

Published : May 8, 2020, 5:18 PM IST

తెలంగాణలో మొట్టమొదటి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మల్ జిల్లాలో ప్రారంభిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా చించోలి(బి) గ్రామంలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులు, వంద పడకల వసతి గృహం పనులను మంత్రి పరిశీలించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అందించడం జరుగుతోందని మంత్రి అన్నారు. బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల్లో పదో తరగతి పూర్తైన తర్వాత విద్యార్థినులు అందులోనే ఇంటర్మీడియట్ చదివేందుకు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని పేర్కొన్నారు.

మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేందర్ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details