రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ నిర్మల్ కలెక్టరేట్ ముందు బీజేవైఎం నిరసస వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో నీళ్లు, నిధులు నియామకాలకోసం బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాలో నేటికీ... ఆత్మహత్యలు కోనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే ఇప్పటికి ఉద్యోగాలు భర్తీ చేయడంలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని మండిపడ్డారు.
'బలిదానాల తెలంగాణలో ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి' - bjym protest at nirmal collectorate
నిర్మల్ కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం ఆందోళన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేసింది.

నిర్మల్ కలెక్టరేట్ లేటేస్ట్ న్యూస్
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ కేసీఆర్ పాలనలో ఇక నిరుద్యోగులకు భవిష్యత్తు లేదంటూ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగులంతా ఏకమై సీఎం కేసీఆర్పై పోరాటానికి సిద్ధమై.. అమరవీరుడు సునీల్ నాయక్ ఆశయసాధనకు ముందుకు రావాలని కోరారు.
ఇదీ చదవండి:కరోనాను అధిగమించిన మద్యం.. రికార్డు స్థాయిలో విక్రయం