150 years old Sadarmat dam has been damaged in Nirmal: 150 ఏళ్ల చరిత్ర కల్గిన పురాతన కట్టడం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని సదర్మాట్ ఆనకట్టకు గండిపడింది. శ్రీరామసాగర్ జలాశయం నుంచి గోదావరికి వరుసగా మూడు నెలలు భారీ ప్రవాహం కొనసాగడంతో ఆనకట్ట ఎప్పుడు కొట్టుకుపోయిందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఆనకట్టపై నుంచి నిండా నీటి ప్రవాహం కొనసాగడంతో ఆనకట్ట కొట్టుకుపోయిన విషయాన్ని అటు అధికారులు కానీ, రైతులు కానీ గుర్తించలేకపోయారు. క్రమక్రమంగా ఎగువప్రాంతం నుంచి నీటి ప్రవాహం తగ్గుతుండటంతో ఆనకట్ట వద్ద నీటిమట్టం భారీగా తగ్గింది. నీటి ప్రవాహం తగ్గడంతో కట్ట తెగిపోయిన విషయం బయటపడింది. నిల్వ ఉన్న నీరు సైతం తెగిపోయిన కట్ట నుంచి గోదావరిలోకి వెళ్లి పోవడంతో ఆనకట్ట ఖాళీ అవుతోంది.