తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు' - నిర్మల్ జిల్లా తాజా వార్తలు

Basara RGUKT: బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిజామాబాద్‌ నుంచి విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బాసరకు వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాంగణం లోపలికి వెళ్లేందుకు వారు యత్నించడంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఏబీవీపీ
ఏబీవీపీ

By

Published : Jun 19, 2022, 4:37 PM IST

Basara RGUKT: బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిజామాబాద్‌ నుంచి విద్యార్థులకు మద్దతుగా బాసరకు వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు క్యాంపస్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వారు నినాదాలతో హోరెత్తించారు. పోలీసులను తోసుకుని ప్రాంగణంలోకి వెళ్లేందుకు యత్నించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాసర పోలీస్​స్టేషన్​కు తరలించారు.

అసలేం జరిగిదంటే:బాసర రాజీవ్‌ గాంధీ సాంకేతిక విశ్వ విద్యాలయంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఆరో రోజు కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఎండ, వానని సైతం లెక్కచేయకుండా తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు.

బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details