తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆశావర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి'

కరోనా మహమ్మారి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్న ఆశావర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ సభ్యులు కోరారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీని కలిసి వినతిపత్రం అందజేశారు.

By

Published : May 10, 2021, 3:03 PM IST

nirmal district collector, nirmal district collector musharaf ali
నిర్మల్ జిల్లా వార్తలు, నిర్మల్ జిల్లా కలెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ

కరోనా మహమ్మారి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలని కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు. పింఛను, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. కొవిడ్​తో మరణించిన ఆశా వర్కర్లకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగామణి, భాగ్యలక్ష్మి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details