తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న విధానాలతో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చామన్పెల్లిలో పర్యటించారు. దోమకాటుతో దెబ్బతిన్న వరికి నిప్పంటించిన రైతు శ్రీనివాస్ రెడ్డి పొలాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ ద్వంద్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం: ఎల్.రమణ - TTDP president L. Ramana
రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న విధానాలతో తెలంగాణ వ్యవసాయ రంగం అట్టుడికి పోతోందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చామన్పెల్లిలో దోమకాటుతో దెబ్బతిన్న వరికి నిప్పంటించిన రైతు శ్రీనివాస్ రెడ్డి పొలాన్ని పరిశీలించారు.
![ప్రభుత్వ ద్వంద్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం: ఎల్.రమణ Telangana TDP president L. Ramana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9332925-473-9332925-1603807320140.jpg)
తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ
దోమకాటుతో మూడెకరాల పంటకు నిప్పంటించడం బాధాకరమని అన్నారు. గ్రామంలో దాదాపు రెండు వందల ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరితో రైతులు నష్టపోతున్నారన్న రమణ.. సీఎం కేసీఆర్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.