రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం నాయకులు నిరసన చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించి ఆదుకోవాలని కోరారు.
'ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలంటూ కలెక్టర్కు వినతి' - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
లాక్డౌన్ కారణంగా పాఠశాలలు సెలవులతో మూతబడి వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం నాయకులు నిర్మల్ జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందించారు.
ఇప్పటికే బడులు పునఃప్రారంభం కాకపోవడం వల్ల చాలామంది ఉపాధ్యాయుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. లాక్డౌన్ సమయానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణకు ప్రత్యేకంగా రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా భృతి అందజేయాలని విజ్జ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :కరోనాతో కుమారుడు... కలతతో తండ్రి మృతి... అంత్యక్రియలు చేసింది ఖాఖీ.!