నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు చితకబాదింది. అల్లరి చేస్తున్నాడనే నెపంతో ఒంటిపై వాతలు వచ్చేలా కొట్టింది.విషయం తెలుసుకున్న అయ్యప్పస్వాములు పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు అల్లరిచేస్తే తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. మాలాధారణలో ఉన్న విద్యార్థిని కమిలిపోయేలా కొట్టడం బాధకరమన్నారు.
అయ్యప్ప మాల వేసుకున్న బాలుడిని చితక్కొట్టిన టీచర్ - teacher beat student in nirmal district
అయ్యప్ప మాలలో ఉన్న విద్యార్థిని ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ చితకబాదిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో జరిగింది. విషయం తెలుసుకున్న అయప్ప స్వాములు పాఠశాల ముందు ఆందోళన చేశారు.
అయ్యప్ప మాల వేసుకున్న బాలుడిని చితక్కొట్టిన టీచర్