తెలంగాణ

telangana

ETV Bharat / state

వాతలు వచ్చేలా కొట్టింది.. - COMPLAIMT

నెల రోజులుగా పాఠశాలకే పోలేదు. స్లిప్​ టెస్టులూ రాయలేదు. ఆ టీచర్​కి కోపమొచ్చింది. కర్రతో వాతలు తేలేలా చితకబాదింది. తప్పు చేస్తే శిక్షేగా దాంట్లో ఏముంది అంటారా....? కానీ ఆరోగ్యం బాలేని రెండో తరగతి పసి పిల్లాడిని ఏమనొద్దని చెప్పినా... గొడ్డులా బాదటాన్ని ఏమనాలి...!

వాతలకు కారణాలవసరం లేదా...!

By

Published : Feb 20, 2019, 8:14 PM IST

వాతలకు కారణాలవసరం లేదా...!

నిర్మల్​లోని ఆదర్శనగర్‌కు చెందిన నర్సయ్య, అశ్విని దంపతుల కుమారుడు నైతిక్‌. నిర్మల్‌ మండలం కొండాపూర్‌ శివారులో ఉన్న సెయింట్‌ థామస్‌ ఉన్నత పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. అనారోగ్యంతో ఇటీవల నెలరోజుల పాటు ఆసుపత్రి పాలయ్యాడు.
పాఠశాలలో స్లిప్‌ టెస్ట్‌లు నిర్వహిస్తుండటంతో ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు పిల్లాడి ఆరోగ్య విషయం వివరించారు. ఫలితాలు ఎలా ఉన్నా పట్టించుకోమని ఆరోగ్యమే ముఖ్యమని తెలిపారు. అవేవీ పట్టించుకోని హిందీ ఉపాధ్యాయురాలు మాత్రం స్లిప్‌ టెస్ట్‌ ఎందుకు రాయలేదంటూ కర్రతో వాతలు తేలేలా చితకబాదింది. విషయం చెప్పినా కూడా ఉపాధ్యాయురాలు కఠినంగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. వివరాలను సేకరించేందుకు వెళ్లిన పాత్రికేయులపై పాఠశాల యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details