నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని కారేగాంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రైవెట్ ఉపాధ్యాయుడు తన పైశాచికత్వం చూపించాడు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విద్యార్థిని చితకబాదాడు.. నిలదీస్తే ప్రాధేయపడ్డాడు - కారేగాం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారని ప్రైవేట్ వారిని నియమించారు. చిన్నపిల్లలని చూడకుండా ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు ఓ టీచర్. తీరా తల్లిదండ్రులు నిలదీస్తే.. బయటకు చెప్పొద్దని ప్రాధేయపడ్డాడు.
విద్యార్థిని చితకబాదాడు.. నిలదీస్తే ప్రాధేయపడ్డాడు
గ్రామంలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉందని ఇద్దరు ప్రైవేట్ ఉపాధ్యాయులను గ్రామస్తులు నియమించారు. సోమవారం మధ్యాహ్నం తరగతికి వెళ్లిన ఉపాధ్యాయుడు తప్పుడు సమాధానం చెప్పడం వల్ల విద్యార్థిని చితకబాదాడు . పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులకు దెబ్బలు చూపించాడు. వారు వెంటనే పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీయగా.. జరిగింది బయటకు చెప్పవద్దని ఉపాధ్యాయుడు ప్రాధేయపడ్డాడు.