తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూ అధికారుల తీరుపై జేసీకి ఫిర్యాదు - తహసీల్దార్​ కార్యాలయం

నిర్మల్​ జిల్లాలోని తహసీల్దార్​ కార్యాలయంలో జేసీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని కొందరు బాధితులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు.

తహసీల్దార్​ కార్యాలయంలో జేసీ ఆకస్మిక తనిఖీలు..

By

Published : Aug 31, 2019, 12:52 PM IST

తహసీల్దార్​ కార్యాలయంలో జేసీ ఆకస్మిక తనిఖీలు..

నిర్మల్‌ జిల్లాలోని రెవెన్యూశాఖలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జాయింట్​ కలెక్టర్​ భాస్కర్‌రావు చేపట్టిన భూ ప్రక్షాళనలో భాగంగా అవినీతి బయట పడుతోంది. నిర్మల్‌ గ్రామీణ తహసీల్దార్‌ కార్యాలయాన్ని జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీలాయిపేట్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు పట్టా పాసుపుస్తకాల ఇవ్వకుండా అధికారులు ఏడాదికాలంగా తిప్పుకుంటున్నారని బాధితుడు జేసీకి ఫిర్యాదు చేశాడు. మరోఘటనలో పట్టణానికి చెందిన ఇద్దరుమత్రులు ఎల్లపెల్లి శివారులోని భూమిని కొని మ్యుటేషన్​ చేయించేందుకు ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నా... ఇప్పటివరకూ అధికారులు స్పందించలేదని వాపోయాడు. దీనితో విచారణ చేపట్టిన జాయింట్​ కలెక్టర్​... తహసీల్దార్​ అనుపమరావు, వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు అధికారులపై చర్యలు చేపడతాం అన్నారు.​

ABOUT THE AUTHOR

...view details