నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శిశుమందిర్ విద్యార్థులు మట్టితో గణపతి విగ్రహాలను తయారు చేశారు. పాఠశాలలో 50 వరకు గణనాథుని ప్రతిమలను మట్టితో తయారు చేసి ఉచితంగా అందించేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం నల్లమట్టి తీసుకువచ్చి ఒక్కో విగ్రహం తయారీకి ముగ్గురు చొప్పున శ్రమపడినట్లు విద్యార్థులు తెలిపారు. చిట్టి చేతులు చేసిన మట్టి వినాయక ప్రతిమలు అందరినీ అబ్బురపరిచాయి.
పర్యావరణాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిన చిన్నారులు - పర్యావరణాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిన చిన్నారులు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శిశుమందిర్ విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడాలనే ధ్యేయంతో మట్టితో వినాయకుణ్ని తయారు చేశారు.
పర్యావరణాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిన చిన్నారులు