తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య - latest news on Student suicide by hanging tree

సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యమే తమ కుమారుని మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నిర్మల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Student suicide by hanging tree in nirmal district
చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య

By

Published : Feb 11, 2020, 8:32 AM IST

Updated : Feb 11, 2020, 9:56 AM IST

నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జె. గంగాధర్(16) కళాశాల సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ముథోల్ మండలం ముద్దల్ గ్రామానికి చెందిన గంగాధర్ ముథోల్ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ( బైపీసీ ) చదువుతున్నాడు. సోమవారం ఉదయం నుంచి కనిపించకపోవడం వల్ల ప్రిన్సిపల్, సిబ్బంది, తోటి విద్యార్థులు చుట్టుపక్కల వెతకగా.. కళాశాల పక్కనే గల ముళ్ల పొదల్లోని ఓ చెట్టుకు వేలాడుతూ గంగాధర్​ మృతదేహం కన్పించింది. సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, ముథోల్ పోలీసులకు తెలిపారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భైంసా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న డీసీవో సరస్వతి కళాశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి బంధువులు, గ్రామస్థులు, వివిధ సంఘాల నాయకులు కళాశాలకు చేరుకొని సిబ్బందిని నిలదీశారు. అనంతరం భైంసా-బాసర రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యమే విద్యార్థి మృతికి కారణమని ఆరోపించారు.

డీసీవో సరస్వతి ఆందోళనకారులకు నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ఇదీ చూడండి :భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..

Last Updated : Feb 11, 2020, 9:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details