తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖానాపూర్​ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి : కలెక్టర్ ఫారూఖి

నిర్మల్ జిల్లా ఖానాపూర్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఖానాపూర్ పట్టణ ప్రగతిపై శాసనసభ్యులు అజ్మీర రేఖాశ్యాంనాయక్​తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఖానాపూర్​ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి : కలెక్టర్ ఫారూఖి
ఖానాపూర్​ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి : కలెక్టర్ ఫారూఖి

By

Published : Aug 1, 2020, 7:56 AM IST

నిర్మల్ జిల్లా ఖానాపూర్ అభివృద్ధికి చర్యలు ప్రారంభించాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో పాలనాధికారి సమావేశ మందిరంలో ఖానాపూర్ పట్టణ ప్రగతిపై ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాంనాయక్​తో కలిసి సమీక్ష నిర్వహించారు. నూతన మున్సిపాలిటీగా ఏర్పాటైన ఖానాపూర్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

విద్యుత్ సమస్యల నివారణ సహా మార్కెట్...

ప్రజా మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పుర వీధుల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని ఎస్ఈ జయవంత్ చౌహన్​కు సూచించారు. కూరగాయల మార్కెట్ ఏర్పాటు, అర్బన్ పార్క్ ఏర్పాటుకు స్థల సేకరణ తదితర అభివృద్ధి అంశాలపై చర్చించారు. సమావేశంలో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ అంకం రాజేందర్, కమిషనర్ గంగాధర్, మేనేజర్ అయ్యుమ్, ఏఈ తిరుపతి, వివిధ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు : రాజు గంగపుత్ర

ABOUT THE AUTHOR

...view details