తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గుర్తించిన ఓడ్ కుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఓడ్ కులస్థులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన క్యాలెండర్లను ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమం కోసం రిజర్వేషన్లతో పాటు వారి అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ వారి అభివృద్ధి పట్ల దృఢనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.