కళాశాల విద్యార్థులకు వ్యాయామ విద్య ప్రవేశ కోర్సులపై అవగాహన ఉండాలని రాష్ట్ర పీఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. దేశంలో వ్యాయామ విద్య ఎంతో అవసరమైందన్నారు. విద్యార్థుల్లో అవగాహన లేకే ఎక్కువ మంది ఆసక్తి కనబర్చటం లేదని పేర్కొన్నారు. వ్యాయామ విద్యపై ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలనే ఉద్దేశంతో గోడపత్రులు ఆవిష్కరిస్తున్నట్లు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి గోడ ప్రతులు ఆవిష్కరించారు.
'వ్యాయామ విద్య ప్రవేశ కోర్సులపై విద్యార్థులకు అవగాహన లేదు' - నిర్మల్ వార్తలు
వ్యాయామ విద్య ప్రవేశ కోర్సులపై కళాశాల విద్యార్థులకు అవగాహన ఉండాలని తెలంగాణ పీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ నిర్మల్లో పేర్కొన్నారు. దేశంలో వ్యాయామ విద్యా ఎంతో అవసరమని.. అవగాహన లేకే ఎక్కువ మంది ఆసక్తి కనబర్చటం లేదన్నారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసినా విద్యార్థులు డీపీఈడీ కోర్సుకు, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు బీపీఈడీలకు మే 13న జరిగే పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సత్యనారాయణ సూచించారు. సంబంధిత విద్యార్థినీ విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 13 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 2 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 13 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు