నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడిల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ జాతర ఆదివారం ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన జాతరలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
పోచమ్మ ఆలయంలోని అమ్మవారి ఆభరణాలను దసరా నవారాత్రుల్లోని మొదటి ఆదివారం దిలావార్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో గల గోదావరిలో జలాభిషేకం చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అమ్మవారి ఆభరణాలకు సాంగ్విలోని గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భాజా భజంత్రీలు, పోతురాజుల నృత్యాలతో దిలావార్పూర్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.