Insects in Basara IIIT mess: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విశ్వ విద్యాలయంలో మూడో రోజు సాలెపురుగు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులపాటు చోటుచేసుకున్న సంఘటనలు మరువక ముందే మరోసారి ఇలా జరగడం వారిని కలవరపెడుతోంది.
Insects in Basara IIIT mess: నిన్నకూరలో కప్ప.. నేడు అన్నంలో సాలెపురుగు
Insects in Basara IIIT mess: బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా మూడో రోజు అన్నంలో సాలెపురుగు రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం కూరలో కప్ప రావడంపై విచారణకు భైంసా ఆర్డీఓ లోకేశ్వర్ రావు మెస్‌ను సందర్శించారు. ఇదే సమయంలో ఓ విద్యార్థి ప్లేటులో సాలె పురుగు రావడాన్ని ఆయన గుర్తించారు.
బాసర ట్రిపుల్ ఐటీ
ఇదే విషయంపై విచారణ కోసం భైంసా ఆర్డీఓ లోకేశ్వర్ రావు మెస్‌ను సందర్శించారు. ఆయన సమక్షంలోనే అన్నంలో సాలెపురుగు రావడాన్ని ఆయన గుర్తించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆర్డీఓ పేర్కొన్నారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్ ప్రత్యూష ఆహార పదార్థాలను పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగిందని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి:Insects in Basara IIIT mess: నిన్నటి కూరలో కప్ప.. నేడు తోకపురుగు..