వరి ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం జఫ్రాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి - paddy purchase inspected by district collector
ధాన్యం కొనుగోళ్లు చేపట్టే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ముషారఫ్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 196 కేంద్రాలకు గాను 177 కేంద్రాలను ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 58 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొన్నామని వెల్లడించారు.4,503 మంది రైతులకు 42.31 కోట్ల రూపాయలు చెల్లించామని వివరించారు.