రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండిరామన్న దత్తసాయి ఆలయనికి చేరుకున్న మంత్రికి వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రహరీగోడ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
'దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది'
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీ గండిరామన్న దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయ ప్రహరీగోడ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
indrakaran reddy
గత ప్రభుత్వాల పాలనలో దేవాలయాలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపిన మంత్రి.. తెరాస పాలనలో అర్చకులకు జీతభత్యాలు చెల్లిస్తుందని గుర్తు చేశారు. యాదాద్రి దేవాలయాన్ని దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఆలయంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వివరించారు.
ఇదీ చూడండి:అభ్యర్థుల ఎంపికపై భాజపా సీఈసీ విస్తృత చర్చ