నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్లో గ్రామ దేవతలకు ఆదివారం పూజలు నిర్వహించారు. గోదావరి నది నుంచి పవిత్ర జలాలను మంగళ వాద్యాలు, హారతుల నడుమ కుండలతో మహిళలు తీసుకొచ్చారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామదేవతలకు అభిషేకం నిర్వహించారు.
కరోనా అంతం కావాలని గ్రామదేవతలకు పూజలు - తెలంగాణ వార్తలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని నిర్మల్ జిల్లా కడ్తాల్లో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. గోదావరి జలాలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.
గ్రామ దేవతలకు పూజలు, కడ్తాల్లో గ్రామదేవతలకు పూజలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు కొప్పుల రాములు, గుర్రం చిన్న భీమన్న, పుట్టి సాయన్న, మేకల అశోక్, బీరెల్లి చిన్న ముత్తన్న, వడ్ల ఎర్రన్న, కోతుర్గాం మల్లన్న, అరిగెల మల్లన్న, వడ్యాల పొశెట్టి, కోడూర్ రాములు, కందూరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ వేళ బయటకు వస్తే కరోనా టెస్టే!