తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు హెచ్చరించారు.

నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు

By

Published : May 25, 2019, 4:46 PM IST

నిర్మల్ జిల్లాలో వ్యవసాయ అధికారులతో కలిసి విత్తనాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని... ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శశిధర్ రాజు హెచ్చరించారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసి, 13 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తక్కువ ధరకు వస్తున్నాయని మోసపోవద్దని సూచించారు. తెలంగాణలో నిషేదించిన మహారాష్ట్ర పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు ఎవరినా గుర్తిస్తే 101కు సమాచారం అందజేయాలని కోరారు.

నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు

ABOUT THE AUTHOR

...view details