ప్రభుత్వం అందజేసే సోయాబీన్ రాయితీ విత్తనాలను.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లోని ఎల్లపల్లిలో రైతులకు రాయితీపై సోయాబీన్ విత్తనాలు అందజేశారు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు అంకితభావంతో పనిచేస్తుందని మంత్రి తెలిపారు.
లాభసాటి పంటలే మేలు...
రాష్ట్రంలో పంటల మార్పిడి చేపట్టి.. అభివృద్ధి పథంలో పయనించాలనే లక్ష్యంతో రైతు పథకాలు చేపడుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం సూచించినట్లు లాభసాటి పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, రాంకిషన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'మిడదల దండుపై దండయాత్రకు సిద్ధంకండి'