నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రములోని వ్యవసాయ కార్యాలయం ముందు రాయితీ సోయా విత్తనాల కోసం రైతులు వర్షం కూడా లెక్కచేయకుండా క్యూలైన్‌లో బారులు తీరారు. విత్తన టోకెన్ కోసం ఉదయం 3 గంటల నుంచే నిలబడినట్లు అన్నదాతలు తెలిపారు.
విత్తనాల కోసం వర్షంలో బారులు తీరిన రైతులు - విత్తనాల కోసం వర్షంలో బారులు తీరిన రైతులు
నిర్మల్ జిల్లాలోని ముధోల్‌లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. గురువారం నుంచి రాయితీ సోయా విత్తనాలు పంపిణీ కావటం వల్ల వ్యవసాయ కార్యాలయం వద్ద టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. వర్షంలోనూ క్యూలైన్‌లో రైతులు నిల్చున్నారు.
విత్తనాల కోసం వర్షంలో బారులు తీరిన రైతులు
రాయితీ విత్తనాలు జిల్లాలో ఆలస్యంగా ఇవ్వటం వల్ల దొరుకుతాయో లేదోనని క్యూలైన్లలో బారులు తీరినట్లు వెల్లడించారు. అటు ప్రభుత్వం ఎకరాకు ఒక బస్తా రెండు ఎకరాలపై ఎంత భూమి ఉన్న రెండే బస్తాలు ఇస్తామనడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు.
TAGGED:
సోయా రైతుకు విత్తన కష్టం