నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని జాఫ్రాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్న పాఠశాలలో గురువారం పాము కలకలం సృష్టించింది. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు.. గది తలుపులు తీయగానే పాము కనిపించింది. భయభ్రాంతులకు గురైన ఉపాధ్యాయులు వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారమిచ్చారు. అతను హుటాహుటిన పాఠశాలకు చేరుకని పామును కర్రతో కొట్టి చంపేశాడు.
పాఠశాలలో పాము కలకలం.. విద్యార్థులు లేనందున తప్పిన ప్రమాదం - snake at jafrapur school
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని జాఫ్రాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్న పాఠశాలలో గురువారం పాము కలకలం రేపింది. పాఠశాల గది తెరవగా ప్రత్యక్షమైన జంతువును పాములు పట్టే వ్యక్తి సహాయంతో చంపేశారు. విద్యార్థులెవరూ స్కూల్కు రానందున ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
పాఠశాలలో పాము కలకలం.. విద్యార్థులు లేనందున తప్పిన ప్రమాదం
విద్యార్థులకు ఇళ్లలోనే ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో పాఠశాలకు ఎవరూ రాకపోవడంతో ప్రమాదం తప్పిందని ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని తల్లిదండ్రులు పాఠశాల అధికారులను కోరారు.
ఇవీ చూడండి :'మమ్మల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పరిగణించండి'