నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరో విడత హరితహారంలో అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు వరండాలో ఇంతకుముందు పెట్టిన మొక్కను పరిశీలించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరితహారం
నిర్మల్ జిల్లా ముథోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరో విడత హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరితహారం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరారు. హరితహారాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుకీ, తెరాస నాయకులు మొక్కలు నాటారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్