తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వచ్ఛంద లాక్​డౌన్ అనగానే.. రోడ్లపైకి చేరిన జనాలు - నిర్మల్ పట్టణంలో 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ స్వచ్ఛంద లాక్​డౌన్

కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున నిర్మల్ పట్టణంలో 11వ తేదీ నుంచి 16వ వరకు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ అమలు చేయాలని నిర్ణయించారు. రేపటి నుంచే లాక్​డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది.

six days voluntary lockdown in nirmal
స్వచ్ఛంద లాక్​డౌన్ అనగానే.. రోడ్లపైకి చేరిన జనాలు

By

Published : Aug 10, 2020, 9:28 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున మంగళవారం నుంచి ఆదివారం వరకు స్వచ్ఛంద లాక్​డౌన్ పాటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. రేపటి నుంచి లాక్​డౌన్ అమలవుతున్నందున నిత్యావసర వస్తువుల దుకాణాల ముందు జనం బారులు తీరారు. న్యూ బస్టాండ్, పాత బస్టాండ్ ప్రాంతం కొనుగోలు దారులు, వాహనదారులతో కిటకిటలాడాయి. ఒక్కసారిగా జనం రద్దీ పెరిగిపోవడం వల్ల భౌతిక దూరంపై నియంత్రణ కరవైంది. దీంతో సాధారణ ప్రజానీకం ఆందోళనకు గురయ్యారు.

జనాలను అదుపు చేసేందుకు దుకాణ యజమానులకు కష్టతరంగా మారింది. ఆరు రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్ పిలుపునిచ్చిన వ్యాపార సంఘాలు... జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. నేరుగా లాక్​డౌన్ ప్రకటిస్తే జనం ఒక్కసారిగా రోడ్లపైకి రాకుండా ఉండేవారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఇవీ చూడండి:బైరామల్​గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details