నిర్మల్ జిల్లా బుధవార్పేట్లోని శివాలయంలో లింగ పున:ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు.. మంత్రోచ్ఛారణల నడుమ శివలింగానికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు.
నిర్మల్లో ఘనంగా లింగ పున:ప్రతిష్టాపన ఉత్సవాలు - minister indrakaran reddy
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాలయంలో.. లింగ పున:ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. వేద మంత్రాల నడుమ.. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. హరహర మహాదేవ శంభోశంకరా అంటూ భక్తులందరూ పారవశ్యంతో మునిగిపోయారు.
Shivalinga restoration ceremonies in Nirmal
జిల్లా కేంద్రం పరిధిలోని పురాతన శివకోటి ఆలయం శిథిలావస్తకు చేరుకుంది. ఆ మేరకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంజూరు చేసిన రూ. 50 లక్షలతో, నిర్వాహకులు నూతన ఆలయాన్ని నిర్మించారు. సోమవారం నాడు శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్యుల చేతులు మీదుగా విగ్రహ ప్రతిష్టాపన చేపట్టనున్నారు.