నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు భవానీ మాల ధరించారు. భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.
దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం - నందిగుండం దుర్గామాత ఆలయం తాజా వార్తలు
నిర్మల్లోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ఈ సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటచారి భక్తులకు మాలధారణ చేశారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. భవానీ దీక్ష కోసం వచ్చే భవానీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి.. బాలాత్రిపుర సుందరిగా కొలువుదీరిన భద్రకాళీ అమ్మవారు