తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ భయం.. స్వచ్ఛంద లాక్ డౌన్‌ పాటిస్తున్న గ్రామాలు - స్వచ్ఛంద లాక్‌ డౌన్‌ పాటిస్తున్న గ్రామాలు

రోజు రోజుకు కరోనా విలయతాండవానికి గ్రామాల్లో ప్రజలు వణికిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు స్వచ్ఛంద లాక్ డౌన్‌ విధించుకుంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగ్రామ్‌ ప్రజలు మూడు రోజులు స్వీయ నిర్బంధం పాటించనున్నట్లు ప్రకటించారు.

Self lock down decision by mahagram
మహాగామ్ గ్రామంలో మూడు రోజులు స్వచ్ఛంద లాక్‌ డౌన్

By

Published : Apr 7, 2021, 3:48 PM IST

నిర్మల్ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజల్లో భయాందోళన రేకేత్తిస్తోంది. తాజాగా కొవిడ్ మహమ్మారిని అడ్డుకునేందుకు భైంసా మండలం మహాగామ్ గ్రామంలో మూడు రోజులు స్వచ్ఛంద లాక్‌ డౌన్ విధించుకున్నారు

జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో స్వచ్ఛంద లాక్​డౌన్​ విధించినట్లు గ్రామస్థులు తెలిపారు. చుట్టు పక్కల గ్రామాల్లోనూ కేసులు రావడంతో అప్రమత్తమై స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు వెల్లడించారు. మూడు రోజుల పాటు లాక్​డౌన్ కొనసాగుతుందని గ్రామస్థులు ప్రకటించారు.

ఇదీ చూడండి:తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై సాయంత్రం సమీక్ష

ABOUT THE AUTHOR

...view details