నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో గోమాతకు సీమంతం నిర్వహించారు. గ్రామానికి చెందిన పురంశెట్టి పద్మ, శ్రీరాములు దంపతులు కొంతకాలంగా ఆవును పెంచుకుంటున్నారు. కుటుంబంలోని ఆడపడుచులా భావిస్తూ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆవు గర్భం దాల్చడంతో సీమంతం చేయాలని నిర్ణయించారు. గోమాతకు కూతురి స్థానం కల్పించి సంప్రదాయబద్ధంగా ఆ వేడుక నిర్వహించారు.
గోమాతకు పెద్ద కూతురి స్థానం.. సంప్రదాయబద్ధంగా 'సీమంతం'
మూగజీవికి ఇంటిమనిషిలా స్థానం కల్పించారు. తమ కుటుంబంలోని ఆడపడుచులా భావించారు. అందుకే తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆవు.. గర్భంతో ఉంటే సీమంతం చేసి ముచ్చటగా తీర్చుకున్నారు ఆ దంపతులు. నిర్మల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
గోమాతకు సీమంతం
ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద కూతురిలా భావించి సీమంతం చేశామని వారు తెలిపారు.
ఇదీ చదవండి:CM KCR: హుజూరాబాద్‌లోని ప్రతీ దళిత కుటుంబానికి రెండునెలల్లో 'దళితబంధు'