నిర్మల్ జిల్లాలోని 21 ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం కరోనా టీకా రెండో డోసు (కొవాగ్జిన్) 1,547 మందికి ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ తెలిపారు. 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి 425 మందికి, 60 ఏళ్లు పైబడిన 1,122 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రంతోపాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండో డోసు టీకా ఇస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లాలో 1,547 మందికి రెండో డోసు టీకా పంపిణీ - కొవిడ్ వ్యాక్సిన్ వార్తలు
కొవాగ్జిన్ రెండో డోస్ టీకాను నిర్మల్ జిల్లాలో 1,547మందికి ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండో డోసు టీకా ఇస్తున్నామని చెప్పారు.
జిల్లాలో 1,547 మందికి రెండో డోసు టీకా పంపిణీ