తెలంగాణ

telangana

ETV Bharat / state

అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం - నిర్మల్​లో అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్.టి.థామస్ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను జడ్పి ఛైర్మన్ సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు.

science fare
అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

By

Published : Dec 3, 2019, 2:20 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని ఎస్.టి.థామస్ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన ఈ వైజ్ఞానిక ప్రదర్శనను జడ్పి ఛైర్మన్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఇందులో జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 520 ప్రదర్శనలను చెపట్టారు. జడ్పి ఛైర్మన్ తోపాటు జిల్లా నాయకులు, విద్యాశాఖ అధికారు విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలను చూసి ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం 12 గంటలకు ప్రారంభం కావడం వల్ల గంటపాటు విద్యార్థులు తమ ప్రదర్శనలను పట్టుకొని పాఠశాల ఆవరణలో వేచిచూడాల్సి వచ్చింది. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా నిలిపేందుకు, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు తెలిపారు.

అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఇవీ చూడండి: కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు...!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details