ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన సోన్ మండల కేంద్రంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కులస్థులకు కమిషన్ భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రుణాలు అందజేస్తుందని అర్హలైన వారికి మూడు ఎకరాల భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్ - ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించాలి
నిర్మల్ జిల్లా సోన్ మండలంలో నిర్వహించిన సివిల్ రైట్స్ డే కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
![ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3989932-213-3989932-1564488820575.jpg)
ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్
ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్
ఇవీచూడండి: మహారాష్ట్రలోనూ భాజపా 'ఆపరేషన్ ఆకర్ష్'!