తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2021, 7:12 PM IST

ETV Bharat / state

కడ్తాల్‌లో సంక్రాంతి వేడుకలు.. కిక్కిరిసిన ఆలయాలు

సంక్రాంతిని పురస్కరించుకుని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలోని ఆలయానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మేళాతాళాలతో ఊరేగించారు.

sankranthi festival Celebrations at the Kadhtal Ayyappa Temple
కడ్తాల్‌ అయ్యప్ప ఆలయంలో వైభవంగా వేడుకలు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని ఆభరణాలు, రంగురంగుల పూలతో అలంకరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.

కడ్తాల్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు

ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో గ్రామ పురవీధుల వెంట మేళాతాళాలతో స్వామివారికి ఊరేగింపు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోనే మొదటి అయ్యప్ప ఆలయం కావడంతో భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం మెట్ల పూజ నిర్వహించి మకరజ్యోతి వెలిగించారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో శ్రీధర్మశాస్త్ర ట్రస్ట్ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి :'కరీంనగర్ డెయిరీ.. పెట్రోల్లోనూ తన మార్క్ చూపించాలి'

ABOUT THE AUTHOR

...view details