తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరస్ నివారణకు బస్ డిపోలో శానిటైజేషన్ - నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు

కొవిడ్ పట్ల ప్రజలు అశ్రద్ధ వహించకూడదని నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు సూచించారు. జిల్లాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున ప్రయాణ ప్రాంగణంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

nirmal rtc  bus depot
నిర్మల్ ఆర్టీసీ డిపోలో శానిటైజేషన్ చేయిస్తున్న డిపో మేనేజర్ ఆంజనేయులు

By

Published : Apr 10, 2021, 4:28 PM IST

బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు కోరారు. కొవిడ్ తగ్గిందని ప్రజలు అశ్రద్ధ చేయవద్దని ఆయన సూచించారు. జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మున్సిపల్ సిబ్బందితో ప్రయాణ ప్రాంగణంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. బస్సుల్లో ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రయాణ ప్రాంగణం, డిపోలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శానిటైజేషన్ చేయిస్తున్నట్టు ఆంజనేయులు వెల్లడించారు.

ఇదీ చూడండి:కరోనా మృతుడికి అంబులెన్స్‌ సిబ్బంది అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details