తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడికి జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు - 19 corona cases in nirmal district

నిర్మల్ జిల్లాలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుిదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో 14 కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేందుకు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.

safety measures in nirmal district to protect from corona virus
కరోనా కట్టడికి జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు

By

Published : Apr 20, 2020, 2:49 PM IST

19 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లాను రెడ్ జోన్​గా ప్రకటించింది. జిల్లాలోని 14 కంటైన్మైంట్ జోన్లలో కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు, ప్రజల రాకపోకలు నియంత్రించేందుకు, ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు పరిచేందుకు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ నోడల్ అధికారులను నియమించారు.

నిర్మల్ పట్టణంలోని ఆరు కంటైన్మైంట్ జోన్లలో ఆరుగురు నోడల్ అధికారులను నియమించి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్, ఆరుగురు సిబ్బందితో ఒక బృందంగా ఏర్పాటు చేశారు. అధికారుల వివరాలు,, వారి ఫోన్ నెంబర్లు ప్రకటించారు.

జోన్ పేరు అధికారి పేరు స్థాయి ఫోన్ నెంబర్
జోహారనగర్ డా.వై రమేశ్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి 7337396421
గాజులపేట కిషన్ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి 7989878995
బుధవార్​పేట సంతోష్ మున్సిపల్ డీఈ 7036661070
గుల్జార్​ మార్కెట్ నరసింహారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు 9866213551
పాన్​గల్లి దేవేందర్ రెడ్డి జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు 9440814754
చిక్కడపల్లి సాయిబాబా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి 9441460325

కంటైన్మెంట్ జోన్లలోని ప్రజల సౌకర్యార్థం నోడల్ అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇతర అత్యవసర సేవలకై ఈ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details