నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. విధుల్లో చేరిన ఉద్యోగుల ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేసి చెప్పుల మాల వేశారు. మహిళా ఉద్యోగులు గాజులను కట్టారు, చీపురుతో కొడుతూ కార్మికులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. విధుల్లో చేరినవారంతా కార్మిక ద్రోహులుగా అభివర్ణించారు.
'పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైంది' - RTC workers staged an innovative protest at the center of Nirmal district
విధుల్లో చేరిన కార్మిక ద్రోహుల చిత్రపటానికి చెప్పుల మాలలు, గాజుల దండలు వేసి మహిళా కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. బతుకమ్మ సంబరాలకు పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైందని అన్నారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

'పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైంది'
బతుకమ్మ సంబరాలకు పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైందని మహిళా కార్మికులు అన్నారు. మీ తండ్రికి ఆర్టీసీ ఆడబిడ్డల బాధను నువ్వైనా చెప్పమ్మా కవితమ్మా అని వేడుకున్నారు. తహసీల్దార్ మృతికి సంతాపం తెలిపిన కేటిఆర్ 23 మంది కార్మికుల ఆత్మబలిదానాలు కనబడటం లేదా అని ప్రశ్నించారు.
'పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైంది'
ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా