నిర్మల్ జిల్లా బాసర ఆర్టీయూకేటికి అరుదైన గుర్తింపు లభించింది. భారత అత్యుత్తమ విశ్వసనీయ విద్యాసంస్థగా నిలిచింది. ముంబయికి చెందిన ఐబీసీ ఇన్ఫో మీడియా సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐబీసీ ఛైర్మన్ కౌశిక్ నుంచి బాసర విద్యాలయం ఉపకులపతి డా.అశోక్ అవార్డు అందుకున్నారు. అవార్టు రావడంపై ఉపకులపతి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల కృషితో మరిన్ని విజయాలు సాధిస్తామని తెలిపారు.
విశ్వసనీయ విద్యాసంస్థగా బాసర ఆర్టీయూకేటీ - rtukt
నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్టీయూకేటీ విశ్వసనీయ విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. ఇవాళ దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐబీసీ సంస్థ ఛైర్మన్ కౌశిక్ చేతులమీదుగా బాసర విద్యాలయం ఉపకులపతి డా.అశోక్ అవార్డును అందుకున్నారు.
![విశ్వసనీయ విద్యాసంస్థగా బాసర ఆర్టీయూకేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4109426-467-4109426-1565543998163.jpg)
విశ్వసనీయ విద్యాసంస్థగా బాసర ఆర్టీయూకేటీ