రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మనోవేదనకు గురిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మౌన ప్రదర్శనకు సీపీఐ, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో 'బస్ కా పయ్య నహీ చలేగా' అంటూ సకలజనుల సమ్మెను విజయవంతం చేసింది ఆర్టీసీ కార్మికులేనని ఆయన గుర్తుచేశారు. ఆర్టీసీ ఒంటరిగా లేదని అఖిలపక్షం వారి వెంటే ఉంటుందని చాడ పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికుల వెంటే అఖిలపక్షం: చాడ - chada supporeted rtc strike at nirmal district
నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మౌన దీక్షకు సీపీఐ, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ ఒంటరిగా లేదని వారి వెంట అఖిలపక్షం ఉంటుందని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.
![ఆర్టీసీ కార్మికుల వెంటే అఖిలపక్షం: చాడ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4730588-811-4730588-1570880799975.jpg)
ఆర్టీసీ కార్మికుల వెంటే అఖిలపక్షం: చాడ