నిర్మల్జిల్లాలో ఆర్టీసీ కార్మికులు కళాకారులుగా నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలోని సమ్మె శిబిరం నుంచి శివాజీ చౌక్ వరకు ర్యాలీ చేశారు. మానవహారం నిర్వహించి కళాప్రదర్శన చేపట్టారు. 26 డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు జోక్యంతో తిరిగి సమ్మె శిబిరం వద్దకు వెళ్లిపోయారు.
కార్మికులే..కళాకారులయ్యారు - rtc workers protest in nirmal district
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె గత 32 రోజులుగా కొనసాగుతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు కాలికి గజ్జ కట్టి, చేత డప్పు పట్టి కళాప్రదర్శన చేపట్టారు.
కార్మికులే..కళాకారులయ్యారు