ముఖ్యమంత్రి మనసు మారాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు హోమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని సమ్మె శిబిరంలో వేద మంత్రోచ్ఛరణలతో హోమం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్న జీయర్ స్వామి చిత్రపటాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు.
నిర్మల్లో ఆర్టీసీ కార్మికుల హోమం - నిర్మల్లో ఆర్టీసీ కార్మికుల హోమం
సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 45వ రోజు కొనసాగుతోంది. కేసీఆర్ మనసు మారాలంటూ నిర్మల్లో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. దీక్ష శిబిరంలో వేద మంత్రోచ్ఛరణలతో హోమం నిర్వహించారు.
నిర్మల్లో ఆర్టీసీ కార్మికుల హోమం
Last Updated : Nov 18, 2019, 7:12 PM IST