తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​లో ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్టులు - nirmal rtc workers strike news

నిర్మల్​ కలెక్టరేట్​ వద్ద దీక్షలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు హైదరాబాద్​లో జరగనున్న మిలియన్​ మార్చ్​ దృష్ట్యా కార్మికులను పట్టణ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

నిర్మల్​లో ఆర్టీసీ కార్మికులు ముందస్తు అరెస్టులు

By

Published : Nov 8, 2019, 12:42 PM IST

హైదరాబాద్​లో శనివారం జరగనున్న ఆర్టీసీ కార్మికుల మిలియన్​ మార్చ్​ నేపథ్యంలో నిర్మల్​లో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్​ వద్ద దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పట్టణ పోలీస్​స్టేషన్​కు తరలించారు. అరెస్టులపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 20 సార్లు అరెస్ట్ చేశారన్నారు. డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. లేకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మిలియన్​ మార్చ్​ను విజయవంతం చేస్తామన్నారు.

నిర్మల్​లో ఆర్టీసీ కార్మికులు ముందస్తు అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details