ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. సమీక్ష సమావేశం అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్మికులు మంత్రికి అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎనలేనిదని, కార్మికుల డిమాండ్లను పరిష్కరించేలా చూడాలని కోరారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతిపత్రం అందజేత
నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తమ డిమాండ్లను పరిష్కరించేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతిపత్రం అందజేత