నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రానికి చెందిన ఓ చిన్నారి 11నెలల వయసులోనే గుండె సంబంధిత వ్యాధికి గురైంది. స్పందించిన ఓ వ్యక్తి.. వైద్య ఖర్చుల కోసం రూ. లక్ష సాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. స్థానికంగా నివసించే సారేపల్లి లక్ష్మణ్ కూతురు దీక్ష గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి ఆపరేషన్ కోసం రూ. 5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న లక్ష్మణ్.. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వైద్యం ఎలా అందించాలో తెలియక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.
మానవత్వం: చిన్నారి చికిత్సకు ఆర్థిక సాయం - donation to child news
ఏడాది కూడా నిండని పసిపాపకు పెద్ద కష్టం వచ్చి పడింది. 11 నెలల వయసులోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్సకు రూ. 5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ పేద తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. స్పందించిన ఓ వ్యక్తి రూ. లక్ష సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
చిన్నారి చికిత్సకు ఆర్థిక సాయం
విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువకులు చిన్నారికి ఆర్థిక సాయం అందించాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. స్పందించిన బూరుగుపల్లి గ్రామానికి చెందిన జాదవ్ అన్వేష్.. పాప వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు సాయం అందించారు. చెక్కును శుక్రవారం చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు.
ఇదీ చదవండి:టీకా రెండు డోసులు తీసుకున్నా.. కరోనా బారిన పడిన కలెక్టర్