నిర్మల్ జిల్లా కేంద్రం పాత నటరాజ్మల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆటో ఢీ కొట్టింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ టీచర్స్ కాలనీకి చెందిన జాదవ్ దాదారావు స్థానికంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. పని ముగించుకొని సైకిల్ పై శివాజీచౌక్ వైపు వస్తుండగా పాత నటరాజ్మల్ సమీపంలోకి రాగానే వెనుకనుంచి వస్తున్న ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన జాదవ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్‌లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి - నిర్మల్‌లో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
నిర్మల్ జిల్లా కేంద్రంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచాడు.
నిర్మల్‌లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి