Three Died In Road Accident At Nirmal : వారంతా పొట్టకూటి కోసం కూలీ పనులు చేసుకుంటారు. రోజూ పనికి వెళితే కానీ వారికి కాలం ముందుకు సాగదు. ఇలాంటి సందర్భంలో ఒక హఠాత్పరిణామం వారి జీవితాలనే తారుమారు చేసింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జాతీయ రహదారిపై కూలీలు పని చేస్తున్నారు. ఇంతలో లారీ చాలా వేగంతో దూసుకువచ్చి.. ఎదురుగా ఉన్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో టిప్పర్ అక్కడే ఉన్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. లారీ క్లీనర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బూరుగుపల్లి గ్రామం వద్ద గల 44వ జాతీయ రహదారి(44th NATIONAL Highway)పై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేశారు.
పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బూరుగుపల్లి గ్రామం వద్ద గల 44వ నంబరు జాతీయ రహదారిపై కూలీలు మరమ్మతు పనులు చేస్తున్నారు. వారు సూచిక బోర్డులు పెట్టిసరే.. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కు ఏపీ 39టీ 9567 నంబరు గల లారీ వేగంతో టిప్పర్ను ఢీ కొట్టింది. బలంగా గుద్దడంతో టిప్పర్... రహదారిపై పనులు చేస్తున్న ఇద్దరు కూలీలను బలంగా ఢీకొట్టింది.
Sand Lorry Hit Vehicles at Bhupalpalli : ఓరి దేవుడా.. ప్రమాదం ఇలా కూడా వస్తుందా..! లారీ కింద ఇరుక్కొని నరకయాతన
Nirmal Road Accident Today : దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ తీవ్రంగా గాయపడడంతో.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క్లీనర్ మృతి చెందాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి.. దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన కూలీలు బోథ్ మండలం చించోలి గ్రామానికి చెందిన ప్రసాద్, నేరడిగొండ మండలం బందం గ్రామానికి చెందిన లాల్ సింగ్, లారీ క్లీనర్ ఖాసీంగా గుర్తించారు.
Viral Video Road Accident in Hyderabad : ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు వ్యక్తి మృతి.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్
Road Accident In Jogulamba Gadwala : అలాగే జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. బీచుపల్లి వద్ద మృతులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం పంక్చర్ పడింది. ఈ క్రమంలో వాహన టైరు మార్చుదామని ఇద్దరు వ్యక్తులు.. అందులో నుంచి దిగారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.
Adilabad Lorry Accident Viral Video : కంటైనర్ బీభత్సం.. లారీ.. బైక్.. ఆటో.. ఆగేదే లే అన్నట్లుగా..
Shamirpet Bus Accident Today : బైక్ ఢీ కొనడంతో బస్సు దగ్ధం.. యువకుడు మృతి